తిరుపతి నగరపాలక సంస్థ కార్యదర్శి మౌర్య, జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇక్కడ జేసీగా పని చేసిన శుభం భన్సల్ పరిశ్రమల శాఖ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. నగరంలో పారిశుద్ధ్య పనులకు మౌర్య ఎంతగానో కృషి చేశారు. ఇటీవల తిరుపతి వేదికగా జరిగిన జాతీయ మహిళా సదస్సును అద్భుతంగా నిర్వహించారంటూ ఆమె ప్రశంసలు పొందారు.