SKLM: ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అందిస్తున్న బోధన పట్ల మరింత సామర్థ్యాలు మెరుగు పరచాలని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. శనివారం జలుమూరు మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు.