SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి మెట్టెక్కి వలస 10వ వార్డు వాంబే కాలనీలో ఉన్న స్మశాన వాటికకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అంత్యక్రియలు జరిగే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకు వెళ్లడంతో స్మశాన వాటికకు నాలుగు విద్యుత్ స్తంభాలు మంజూరు చేయించారని స్థానిక కూటమి నాయకులు తెలిపారు.