TG: బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించడం లేదంటే ఎలా? అని ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే OBC నుంచే సీఎం అవుతారని స్పష్టం చేశారు. జేబీఎస్ దగ్గర బీసీ బంద్‌లో ఈటల పాల్గొన్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లోనూ, మంత్రివర్గాల్లోనూ బీసీ వాటా కావాలన్నారు.