MHBD: గార్ల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య పలు గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 89 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొంటున్న వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.