ATP: సూర్యశక్తిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. వినియోగదారులకు రాయితీ ఇస్తోందని చెప్పారు. బీసీ వర్గాలకు అదనంగా రూ. 20,000, ఎస్సీ, ఎస్టీకి ఉచిత సదుపాయం ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో 10-20 ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.