AP: తనపై తప్పుడు రాతలు రాసేవాళ్లకి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎకరం రూ.వందకి ఇచ్చేస్తే గొప్ప.. అదే తాను రైతుల భూములను మార్కెట్ రేటుకు కొంటే తప్పా అని నిలదీశారు. కావాలంటే తాను కొన్నరేటుకే ఇచ్చేస్తా తీసుకోండని తేల్చి చెప్పారు.