NDL: బనగానపల్లె పట్టణంలోని బీసీ గురెడ్డి కాలనీలో శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి హమాలీలకు దుస్తులను పంపిణీ చేశారు. తన తండ్రి బీసీ గురెడ్డి జ్ఞాపకార్థంగా హమాలీలకు ప్రతి సంవత్సరం దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలకు సహాయం చేయడమే తమ లక్ష్యమని రాజారెడ్డి తెలిపారు.