KMM: వైద్య వృత్తి పవిత్రమైనదని, రోగుల పట్ల సేవా భావాన్ని వైద్యులు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం కలెక్టర్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన 2025-వైట్ కోట్ సెర్మనిలో పాల్గొన్నారు. వైద్య వృత్తి ఎన్నుకున్న విద్యార్థులు అకాడమిక్స్లో పట్టు సాధించడంతో పాటు మానవ శ్రేయస్సు కోసం ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.