MDK: తూప్రాన్ పట్టణంలో కోర్టు ఏర్పాటుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ ఇవాళ భవనం పరిశీలించారు. తూప్రాన్ పట్టణానికి కోర్టు మంజూరు కాగా, మండల ప్రజా పరిషత్ పాత భవనం కోర్టు కోసం అప్పగించారు. ఈ సందర్భంగా కోర్టు ఏర్పాటు కోసం న్యాయమూర్తి నీలిమ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. అవసరమైన ఎస్టిమేషన్ వేసి అందజేయాలని డీఈ వేణును ఆదేశించారు.