VZM: గజపతినగరంలోని వెనుకబడిన తరగతుల బాలుర బాలికల వసతి గృహాలతో పాటు బాలసదనాన్ని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి విజయ రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి అందుతున్న సదుపాయాలు గురించి ఆరా తీశారు. విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యను అలవర్చుకొని ఉన్నత పౌరులుగా ఎదగాలని సూచించారు.