HYD: 42 శాతం రిజర్వేషన్ల కోసం నేడు బీసీ సంఘాలు బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ నగరంలో దీపావళికి ఇంటికి వెళ్లే వారిపై తీవ్రంగా పడింది. అటు ఉద్యోగులు, కూలీలు కూడా బస్ రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నగరంలో ఇదే అదునుగా ప్రైవేట్ క్యాబ్, ర్యాపిడో, ఊబర్లు ధరలను పెంచాయి. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పలువురు వాపోయారు.