ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న తమిళ హీరో విశాల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన శరీరానికి ఇప్పటివరకూ 119 కుట్లు పడ్డాయని తెలిపారు. సినిమాల్లో ఎంత రిస్క్ స్టంట్స్ అయినా స్వయంగా చేస్తానని, డూప్‌తో చేయించడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. ఆయా యాక్షన్ సీక్వెన్స్‌ల్లో గాయాల కారణంగా అన్ని కుట్లు పడ్డాయని పేర్కొన్నారు.