TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్.. తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. తన పేరు మీద 14.39 ఎకరాల భూమి, యూసుఫ్ గూడలో 860 గజాల ఇంటి స్థలం, భార్య పేరు మీద 4.30 ఎకరాల భూమి, 466 గజాల స్థలంలో ఇల్లు ఉన్నాయన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.35.41 కోట్లు ఉన్నాయన్నారు.