HYD: తెలంగాణ పంచాయత్ సెక్రెటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ఈరోజు ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిశారు. తమ సమస్యలను పరిష్కరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమెను శాలువాతో సత్కరించారు. రూ.104 కోట్లు బిల్లులు విడుదల చేయించినందుకు, అలాగే డిప్యూటేషన్లకు అనుమతి ఇచ్చినందుకు మంత్రి సీతక్కకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.