TG: రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలే బంద్కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. బీసీ బిడ్డలను పదేపదే కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయని.. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు.