TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను TTD అధికారులతో కలిసి శుక్రవారం టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ.. TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నవంబర్ 15 లోపు ఏర్పాట్లను పూర్తి అవుతుందన్నారు.