పాక్ వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ఈ క్రమంలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడల కంటే దేశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో అఫ్గాన్ నుంచి నేర్చుకోవాలంటూ విమర్శించారు.