SRD: మండల కేంద్రమైన న్యాల్కల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు శనివారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దుకాణ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ నిర్వహించారు. స్థానిక ప్రధాన రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగించి వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.