HYD: బీసీ రిజర్వేషన్ల కోసం చేపట్టిన రాష్ట్ర బంద్కు మంత్రి వాకిటి శ్రీహరి మద్దతు తెలిపారు. ముషీరాబాద్ డిపో వద్ద జరిగిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు.