TG: దీపావళి పండగ సందర్బంగా హైదరాబాద్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని సిటీ బస్సుల బంద్ కారణంగా పండగకు సొంత ఊర్లకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో రైళ్ల సర్వీసులు యధావిధిగా కొనసాగుతుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రధాన మెట్రో స్టేషన్ల వద్ద, ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీనగర్, అమీర్ పేట్ తదితర కేంద్రాల్లో పుల్ రష్ కనిపిస్తోంది.