KRNL: ఎమ్మిగనూరు పట్టణ సమీపంలో పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన లెదర్ సోసైటీలో అక్రమాలపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిలువ ఉన్న లెదర్ స్టాక్‌ను పరిశీలించారు. సంబంధిత అధికారులకు జరుగుతున్న అక్రమాలపై విచారణ చేయాలని ఆదేశించారు. బయట తాళం లోపల పని జరుగుతున్న తీరును మండిపడ్డారు.