HYD: దోమలగూడలోని హెరిటేజ్ అపార్ట్‌మెంట్స్‌లో వృద్ధ దంపతులపై దాడిచేసి బంగారం దొంగిలించినకేసులో కేర్ టేకర్ గోవర్ధన్‌ను అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ DCP శిల్పవల్లి తెలిపారు. గోవర్ధన్ ఆన్లైన్ బెట్టింగ్, చెడు వ్యసనాలకు అలవాటై డబ్బు కోసం దంపతులపై రోకలి బండతో దాడిచేసి బంగారాన్ని ముత్తూట్‌లో పెట్టి రూ.3లక్షలు తీసుకున్నాడన్నారు. తాజాగా కృష్ణ జిల్లాలో నిందితుడిని అరెస్టు చేశామన్నారు.