WGL: రేపటి బీసీ బందుకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లపల్లి ప్రణయ్ దీప్ మాదిగ మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బీసీ 42% రిజర్వేషన్ షెడ్యూల్ 9 చేర్చి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అనంతరం రేపటి బందుకు సహకరించాల్సిందిగా ఎమ్మెల్యేను కోరారు.