WGL: పట్టణంలోని ఏనుమాముల మార్కెట్లో పాలకవర్గం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా మార్కెట్కు తీసుకొచ్చిన పంటలను ఆరబెట్టేందుకు టార్పాలిన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. MLA, మంత్రి మధ్య విభేదాల వల్ల గతంలో ప్రకటించిన పాలకవర్గం రద్దయింది. ఇప్పటికైనా పాలకవర్గం ప్రకటిస్తే మార్కెట్ స్థిరపడుతుందని రైతులు కోరారు.