పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య నెలకొన్న ఘర్షణలను పరిష్కరించడం తనకు చాలా తేలిక అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపానని, అలాగే మిలియన్ల మంది ప్రాణాలకు కాపాడానని పేర్కొన్నారు. అయినప్పటికీ నాకు నోబెల్ ప్రైజ్ రాలేదన్నారు. దాని కంటే ప్రజలను రక్షించడమే తనకు ముఖ్యమని తెలిపారు.