NLG: మిర్యాలగూడకు ప్రయాణిస్తున్న నెమ్మాని సంధ్య ఆటోలో తన ల్యాప్‌టాప్‌తో పాటు రూ. 1500 నగదు మరిచిపోయారు. అయితే ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ వాటిని నల్గొండ టూ టౌన్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఎస్సై వై. సైదులు విచారణ జరిపి ల్యాప్‌టాప్, నగదును సదరు మహిళకు అందజేశారు. లతీఫ్ నిజాయితీని ఎస్సై అభినందించారు. ఈ మంచితనం ఆదర్శనీయమని ఎస్సై పేర్కొన్నారు.