మహిళల టీ20 క్రికెట్లో మహారాష్ట్ర బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే ప్రపంచ రికార్డు సృష్టించింది. సీనియర్ టీ20 ట్రోఫీలో పంజాబ్‌పై కేవలం 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. దీంతో మహిళల టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. ఈ క్రమంలో ఆమె న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ పేరిట ఉన్న గత రికార్డును బద్దలు కొట్టింది.