MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. బీసీ బంద్ పిలుపు ఉన్న నేపథ్యంలో, వివిధ పార్టీలకు చెందిన నేతల నిరసనలు, ప్రజల ఆవేశపూరిత ప్రసంగాలతో ఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లు ముందుగానే ఊహించి, పకడ్బందీ చర్యలు చేపట్టారు. దాదాపుగా 50 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నారు.