AP: ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 3వేల రైతు సేవా కేంద్రాలు, 2061 ధాన్యం కొనుగోలు కేంద్రాలతో సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు.