‘బలగం’ ఫేమ్ వేణు యేల్దండి ‘ఎల్లమ్మ’ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారట. అయితే ఈ సినిమాలో DSP సరసన నటి కీర్తి సురేష్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.