కృష్ణా: గుడివాడ మున్సిపల్ సంఘ పరిధిలో SASA (క్లీన్ ఎయిర్) కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులలో ఎయిర్ పొల్యూషన్, ఆరోగ్యంపై దాని ప్రభావాలపై శనివారం అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పబ్లిక్ ప్రదేశాల్లో మొక్కలను నాటారు. కార్ ఫ్రీ, బైక్ ఫ్రీ, పాటించాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది సాధ్యమైనంత వరకు సైకిల్‌పై గాని లేదా, నడిచి ఆఫీసుకు రావాలన్నారు.