కోనసీమ: వైజాగ్ వేదికగా గూగుల్ డేటా సెంటర్ రావడం రాష్ట్ర చరిత్రలో మేలి మలుపుగా నిలుస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి దండంగి మమత వ్యాఖ్యానించారు. ఆలమూరు మండలం చింతలూరులో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం కంపెనీలు, పెట్టుబడులు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తుందని ఆమె తెలిపారు.