KRNL: కోటి సంతకాల ఉద్యమానికి ప్రజలు మద్దతు పలకాలని వైసీపీ నాయకులు అన్నారు. శనివారం తుగ్గలి మండల కేంద్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదు అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కోటి సంతకాల ఉద్యమానికి ప్రజలు మద్దతు పలకాలని వారు కోరారు.