SRCL: వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని బర్దిపూర్ (సంగారెడ్డి జిల్లా) కు చెందిన శ్రీ శ్రీ శ్రీ దత్తగిరి మహారాజ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం, ఆలయ అధికారులు మహారాజ్‌కు స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.