సత్యసాయి: సోలార్ విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంటి అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఆదాయం కూడా ఆర్జించ వచ్చునని మంత్రి సవిత తెలిపారు. ఇవాళ పెనుకొండలో సోలార్ విద్యుత్ వినియోగంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి సవిత పాల్గొన్నారు. సోలార్ విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షించుకుందామన్నారు. ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానళ్లు బిగించుకోవాలని సూచించారు.