WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారి శివకుమార్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగు చేసిన పత్తి పంటను అమ్ముకోవాలంటే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వివరాల కోసం సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సిందిగా కోరారు.