ATP: గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్‌కు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ పాఠశాలకు నిధులు కేటాయించాలన్నారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న పనులకు మరమ్మతులు చేపించాలని వారు డిమాండ్ చేశారు.