MDK: దీపావళి స్పెషల్ ఆఫర్ల పేరుతో సైబర్ మోసగాళ్లు చేసే మోసాలకు గురికా వద్దని మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సోషల్ మీడియా, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా నకిలీ వెబ్సైట్లు, లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 390 మంది బాధితులు రూ. 8.5 లక్షలు కోల్పోయారన్నారు.