ADB: ఆదిలాబాద్ నూతన డీపీఆర్ఓగా విష్ణు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి మొక్కను అందజేశారు. ఇక్కడ డీపీఆర్ఓగా పని చేసిన తిరుమల కామరెడ్డికు బదిలీ అయ్యారు. నిర్మల్ డీపీఆర్ఓగా పని చేసిన విష్ణు బదిలీపై ఆదిలాబాద్ వచ్చారు. ఇంతకు ముందు విష్ణుకు ఆదిలాబాద్ డీపీఆర్ఓగా పని చేసిన అనుభవం ఉంది.