VZM: పట్టణంలో ముందుగా గుర్తించిన 21 ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. పట్టణంలో నేరాలను నియంత్రించేందుకు, గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణను అరికట్టేందుకు, రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టామన్నారు.