సత్యసాయి: తాడిమర్రి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.