MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో పోలీస్, మున్సిపల్ సిబ్బందికి సిపిఆర్ పై అవగాహన శిక్షణ నిర్వహించారు. గురువారం జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జ్ఞానేశ్వర్, చేగుంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో సిపిఆర్ చేయడంపై శిక్షణ అందజేశారు. కార్యక్రమంలో సిహెచ్వో లక్ష్మి, మెడికల్ అధికారి జ్యోత్స్నా దేవి, సిహెచ్వో బాల నరసయ్య పాల్గొన్నారు.