MHBD: ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఇవాళ నెల్లికుదురు మండలం శ్రీరామగిరి శివారు పంతులు తండా సమీపంలో చోటుచేసుకుంది. ధారావత్ భరత్ అనే వ్యక్తి తన బైక్పై నెల్లికుదురు నుంచి భరత్ ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బైక్ను ఢీ కొట్టడంతో మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.