సత్యసాయి: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా తన పెద్ద కుమారుడు జూలకంటి గౌతంరెడ్డి వివాహానికి రావాలని పెళ్లి పత్రిక అందజేశారు. వారిని ఆప్యాయంగా పలకరించిన బాలకృష్ణ తప్పక వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యుల బాగోగులు స్థానిక రాజకీయాలపై ఆరా తీశారు.