ATP: గుత్తి R&B బంగ్లాలో గురువారం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణను అన్న క్యాంటీన్ వద్దగల దుకాణాల నిర్వాహకులు కలిశారు. అనంతరం ఎంపీకి వినతి పత్రం అందజేశారు. దుకాణాల నిర్వాహకులు మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా రోడ్డు పక్కన దుకాణాల సముదాయం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామన్నారు. దుకాణాలను తొలగించరాదని ఎంపీకి విన్నవించారు.