W.G: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం తన కూటమి నాయకులతో కలిసి భీమవరం ఏవిజి సినిమాస్లో ‘మిత్ర మండలి’ చిత్రాన్ని తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని, కుటుంబంతో కలిసి చూసి ఆనందించవచ్చని, హాయిగా నవ్వుకోవచ్చని తెలిపారు. చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు.