MLG: జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి, ఇప్పగూడెం మధ్య వ్యవసాయ పొలంలో ఓ వింత పక్షి స్థానిక రైతులను ఆకట్టుకుంది. పావురం వలే ఉండి, ఎరుపు కళ్లతో, పెద్ద రెక్కలతో దర్శనమిచ్చింది. స్థానిక రైతులు ఆ పక్షిని చేతితో పట్టుకోగా, కొంతమంది తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. కాగా,రాత్రి సమయాల్లో ఈ పక్షి మనుషుల వలె కేకలు వేస్తూ శబ్దాలు చేస్తోందని స్థానికులు తెలిపారు.