TPT: నాగలాపురం మండలం బైటకొడియం గ్రామం వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. సురుటిపల్లి సచివాలయం నుంచి విధులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తున్న మండల సర్వేయర్ సునీత ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సునీత అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.