SRPT: మట్టపల్లి మండలంలోని దొనబండ తండా గ్రామంలో గురువారం వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. వివిధ పనుల నిమిత్తం వెళుతున్నప్పుడు కుక్కలు దాడి చేశాయని బాధితులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానికులు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.